News January 5, 2025

ఓడినా.. చాలా పాజిటివ్ అంశాలున్నాయి: గంభీర్

image

ఆశించిన మేర రాణించకపోవడంతోనే BGT కోల్పోయామని కోచ్ గంభీర్ అన్నారు. మెరుగైన ప్రదర్శనకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో వర్కౌట్ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సిరీస్‌లో చాలా పాజిటివ్ అంశాలున్నాయన్నారు. AUSపై తొలి పర్యటనలోనే నితీశ్, ఆకాశ్, జైస్వాల్, ప్రసిద్ధ్ రాణించారని చెప్పారు. సిరాజ్ మంచి ప్రదర్శన చేశారని కొనియాడారు. భారత్ 5నెలల తర్వాత తిరిగి టెస్టులు ఆడనుందని, అప్పటికి అన్నీ సెట్ అవుతాయని చెప్పారు.

Similar News

News January 16, 2025

IND క్రికెటర్లు, కోచ్‌పై కఠిన ఆంక్షల వెనుక..

image

క్రికెటర్లపై BCCI <<15152483>>కఠిన ఆంక్షల<<>> వెనుక తీవ్ర కారణాలున్నట్లు TOI వెల్లడించింది. ‘AUS టూర్‌లో ప్లేయర్లు గ్రూపులుగా ట్రావెల్ చేశారు. దీంతో జట్టు బాండింగ్ మిస్సయ్యింది. ఆ మొత్తం పర్యటనలో ఒకేసారి టీమ్ డిన్నర్ జరిగింది. పలువురు తమ కుటుంబాలతో హోటళ్లలో స్టే చేస్తున్నారు. ఆఖరికి కోచ్ గంభీర్ కూడా క్రికెటర్లతో కాకుండా తన సొంత మనుషులతో బయటకు వెళ్లారు. దీంతోనే BCCI ఈ చర్యలకు దిగింది’ అని పేర్కొంది.

News January 16, 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో సంఘం ఛైర్మన్‌ను నియమించనుంది. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 JAN 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. అటు స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.3,985 కోట్లతో మూడో స్పేస్ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయనుంది.

News January 16, 2025

2 నెలల్లో ఉచిత బస్సు పథకం: మంత్రి మండిపల్లి

image

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో AP దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. తిరుపతి(D)లోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.