News August 6, 2024

ప్రపంచ విజేతను గెలిచినా.. దేశంలోని వ్యవస్థ ముందు ఓడింది: పునియా

image

పారిస్ ఒలింపిక్స్‌లోని రెజ్లింగ్‌‌లో ప్రపంచ విజేతను ఓడించిన వినేశ్ ఫొగట్‌ దేశంలోని వ్యవస్థ ముందు ఓడిందని ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పునియా అన్నారు. ‘వినేశ్ ఫొగట్‌ ఈరోజు వరుస మ్యాచుల్లో గెలిచి గర్జించింది. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్‌, డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించింది. కానీ తన దేశంలోనే ఈ అమ్మాయిని తన్ని చితకబాది వీధుల్లోకి లాగారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Similar News

News September 18, 2024

వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్‌తో భేటీ

image

AP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్‌కు బాలినేని పంపారు. పార్టీ తీరుపై ఎన్నికల సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్‌తో భేటీ అనంతరం కూడా బెట్టు వీడలేదు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని జనసేనలో చేరికపై ఆయనతో చర్చించనున్నారు.

News September 18, 2024

పరారీలో జానీ మాస్టర్

image

TG: అత్యాచారం కేసు తర్వాత జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు ఫోన్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. లద్దాక్‌లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు బృందాలు ఆయన కోసం అక్కడకు బయల్దేరాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులనూ సంప్రదించారు.

News September 18, 2024

పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం: కేంద్రమంత్రి

image

లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.