News March 17, 2024
చిలకలూరిపేట సభకు మోదీ పర్యటన వివరాలు

మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.
Similar News
News April 3, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు

గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం రాత్రికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ప్రకటనలో తెలిపాడు. అలాగే, జిల్లా పక్కనే ఉండే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
News April 3, 2025
బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
గుంటూరు జిల్లాలో బార్లకు ఈ-వేలం

రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఏప్రిల్ 9న అత్యధిక బిడ్దారులకు లైసెన్సులు కేటాయించనున్నారు. అందులో గుంటూరు జిల్లాలో తెనాలి మునిసిపాలిటీకి-5, పొన్నూరు-2, మంగళగిరి-తాడేపల్లికి-1 కేటాయించారు.