News September 26, 2024

‘దేవర’ ALL TIME RECORD

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ అరుదైన రికార్డు సృష్టించనుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఒకే రోజు 42 షోలు ప్రదర్శించనున్నారు. ఈ ఘనత అందుకోనున్న తొలి చిత్రం ఇదేనని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ట్వీట్ చేసింది. 1AM షోలు కూడా వేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఈ మల్టీప్లెక్స్‌లో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని అత్యధికంగా ఒకే రోజులో 41 షోలు ప్రదర్శించారు.

Similar News

News October 4, 2024

వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారు: పేర్ని నాని

image

AP: వైసీపీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు. చంద్రబాబులా జగన్‌కు మద్దతు అవసరం లేదని, ఆయన ఒంటరిగా వస్తారని చెప్పారు.

News October 4, 2024

యూట్యూబ్ షార్ట్స్ నిడివి ఇక 3 నిమిషాలు!

image

కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 60 సెకన్లు మాత్రమే ఉంటున్న షార్ట్స్ నిడివిని ఈ నెల 15 నుంచి 3 నిమిషాలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కంటెంట్‌ని మరింత విస్తృతంగా చెప్పేందుకు ఎక్కువ నిడివి కావాలంటూ చాలాకాలంగా తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని ఈ సందర్భంగా వివరించింది. దీంతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు కూడా తీసుకొస్తున్నామని పేర్కొంది.

News October 4, 2024

పాలనలో ఫెయిల్ కావడంతోనే బాబు టాపిక్ డైవర్ట్ చేశారు: జగన్

image

AP: చంద్రబాబు పాలనలో ఫెయిలవడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు లడ్డూ వివాదం సృష్టించారని జగన్ ఆరోపించారు. ‘JULY 23న లడ్డూ తయారీకి సంబంధించిన రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ అని చెప్పి సెప్టెంబర్ 18న తన 100 రోజుల పాలన మీద మాట్లాడుతూ ఈ రిపోర్ట్ గురించి చెప్పారు’ అని జగన్ అన్నారు. నెయ్యిలో కలిసింది జంతు కొవ్వు కాదని, అయినా దాన్ని తిరస్కరించామని TTD EO అంటుంటే బాబు అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.