News September 17, 2024
రిలీజ్కు ముందే చరిత్ర సృష్టించిన ‘దేవర’

జూ.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్లో అత్యంత వేగంగా $1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి.
Similar News
News December 3, 2025
అల్లూరి: అత్తను హత్య చేసిన కోడలికి జైలు

రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కె. జ్యోతికి బుధవారం రంపచోడవరం మేజిస్ట్రేట్ కోర్టు 7 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. 2024లో నిందితురాలు తన అత్త లక్ష్మిని కర్రతో కొట్టి దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి మృతి చెందింది. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు వివరించారు.
News December 3, 2025
ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.
News December 3, 2025
రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.


