News September 17, 2024
రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన ‘దేవర’
జూ.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్‌లో అత్యంత వేగంగా $1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి.
Similar News
News October 10, 2024
పవన్ కళ్యాణ్‌కు మరోసారి అస్వస్థత
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.
News October 10, 2024
టెన్నిస్‌కు రఫెల్ నాదల్ గుడ్ బై
స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ తనకు చివరి సిరీస్ అని ఆయన ప్రకటించారు. కాగా 38 ఏళ్ల నాదల్‌ను ‘కింగ్ ఆఫ్ క్లే’గా పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్, 14 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్ టైటిళ్లు నెగ్గారు. దాదాపు ఐదేళ్లు వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగారు. ఫెడరర్‌పై 40, జకోవిచ్‌పై 60 మ్యాచులు గెలిచారు.
News October 10, 2024
జమ్మూకశ్మీర్‌లో అప్పుడే మాటల యుద్ధం
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 2 రోజులకే జమ్మూకశ్మీర్‌లో NC, BJP మధ్య మాటల యుద్ధం మొదలైంది. JKకు రాష్ట్ర హోదాపైనే అసెంబ్లీలో తొలి తీర్మానం చేస్తామని, అదే తమ టాప్ ప్రయారిటీ అని కాబోయే CM ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే, ఆర్టికల్ 370 రద్దు సహా NC విధానాలను జమ్మూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అందుకే ఆ పార్టీ ఈ ప్రాంతంలో ఒక్క సీటూ గెలవలేదని బీజేపీ నేత రామ్ మాధవ్ దుయ్యబట్టారు.