News November 22, 2024
హిందీ వెర్షన్‌లో ‘దేవర’
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్-డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ హిందీ వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషించారు.
Similar News
News November 22, 2024
కేజ్రీవాల్ కంటే ఆతిశీ వెయ్యి రెట్లు నయం: LG
ఆప్ ప్రభుత్వంతో నిత్యం తగువుకు దిగే LG సక్సేనా మొదటి సారి CM ఆతిశీని ప్రశంసించారు. IGDT మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘లింగ భేదాన్ని నిలువరించి ఇతరులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి. ఈ రోజు ఢిల్లీ సీఎం మహిళ అయినందుకు సంతోషిస్తున్నా. గత పాలకుడి(కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు నయం’ అన్నారు. LG వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
News November 22, 2024
మీకు వేగంగా తినే అలవాటు ఉందా..?
భోజనం వేగంగా తినడం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు. తినే ఆహారం మాత్రమే కాదు, తినే విధానమూ ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. నిదానంగా భోజనం చేసే వారిలో డయాబెటిస్, PCOD, హై బీపీ వంటి సమస్యలు తక్కువని వివరిస్తున్నారు. తొందరగా తినే అలవాటు వల్ల జీర్ణకోశ సమస్యలు, అధిక బరువు, మెటబాలిజం సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి Relax and Eat. SHARE IT.
News November 22, 2024
3వ అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు.. వదులుకున్న ఉక్రెయిన్!
ఇప్పుడంటే ఆయుధాల కోసం అమెరికా వద్ద చేయి చాస్తోంది కానీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కొత్తలో ఉక్రెయిన్ వద్ద ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయుధ నిల్వలు ఉండేవి. 5వేలకు పైగా అణ్వాయుధాలు, 170కి పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వార్ హెడ్స్ వంటి వాటినన్నింటినీ 1996కల్లా రష్యాకు ఇచ్చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరి, అందుకు బదులుగా స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు తెచ్చుకుంది.