News November 22, 2024
హిందీ వెర్షన్‌లో ‘దేవర’
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్-డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ హిందీ వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషించారు.
Similar News
News December 5, 2024
దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.
News December 5, 2024
సౌదీలో పుష్ప-2 ‘జాతర’ సీక్వెన్స్ తొలగింపు!
పుష్ప-2 సినిమాకు సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఇందులోని 19 నిమిషాల జాతర ఎపిసోడ్‌ను తొలగించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. బన్నీ అమ్మవారి గెటప్, హిందూ దేవతల గురించి ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. దీంతో 3 గంటల ఒక నిమిషం వ్యవధితోనే చిత్రం అక్కడ ప్రదర్శితమవుతున్నట్లు పేర్కొంది. కాగా సింగమ్ అగైన్, భూల్ భులయ్య-3 చిత్రాలను ఆ దేశం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
News December 5, 2024
అప్పుడు JIO, VI, AIRTELకు చుక్కలే!
JIO, AIRTEL, VIకు BSNL గట్టి పోటీనిస్తోందని పరిశ్రమ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 3G, సర్వీస్ సమస్యలున్నప్పుడే ఇలావుంటే 4G/5G, నెట్‌వర్క్ విస్తరణ, శాటిలైట్ సర్వీసులు ఆరంభిస్తే చుక్కలు తప్పవని వారి అంచనా. PVT ఆపరేటర్లు రీఛార్జి ప్లాన్లను 25% మేర పెంచడం తెలిసిందే. దీంతో 4 నెలల్లోనే BSNLలో 65 లక్షల కొత్త కస్టమర్లు చేరారు. పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ ఇప్పట్లో ధరలు పెంచదని సమాచారం. మీ COMMENT?