News September 11, 2024
రికార్డు సృష్టించిన ‘దేవర’ ట్రైలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ నుంచి రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. రిలీజైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్‌కు 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు యూట్యూబ్‌లో ట్రైలర్ ట్రెండ్ అవుతోందని తెలిపారు. కాగా, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని, ఓ ట్రైలర్‌కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారని సినీవర్గాలు చెబుతున్నాయి.
Similar News
News July 11, 2025
ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.
News July 11, 2025
మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
News July 11, 2025
బిజినెస్ అప్‌డేట్స్

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు