News August 1, 2024
BJP చీఫ్‌గా దేవేంద్ర ఫడ్నవీస్?
BJP నేషనల్ చీఫ్‌గా మహారాష్ట్ర డిప్యూటీ CM ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని వారాల్లో ఫడ్నవీస్ డిప్యూటీ CM పదవికి రాజీనామా చేయనున్నారట. అటు ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్ ముగిసిన వెంటనే అన్ని రాష్ట్రాల BJP చీఫ్‌లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం.
Similar News
News December 12, 2024
వారిపై చట్టపరమైన చర్యలు: సాయిపల్లవి
తనపై వస్తోన్న రూమర్స్‌పై హీరోయిన్ సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ట్వీట్ చేశారు. కాగా ‘రామాయణ’లో సీత పాత్ర చేసేందుకు సాయిపల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్‌సైట్ కథనాలు ప్రచురించింది. దానిపై ఆమె ఈ విధంగా స్పందించారు.
News December 12, 2024
ఫ్యామిలీలో గొడవ.. మంచు లక్ష్మీ మరో పోస్ట్
ఓ వైపు మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతుండగానే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న మరో పోస్ట్ చేశారు. ‘ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య రెండు రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
News December 12, 2024
ప్రమాణ స్వీకారానికి రండి: జిన్‌పింగ్‌కు ట్రంప్ ఆహ్వానం!
అమెరికా ప్రెసిడెంట్‌గా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. చైనా పేరెత్తితేనే భగ్గుమనే ఆయన JAN 20న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆ దేశ ప్రెసిడెంట్ షి జిన్‌పింగ్‌ను ఆహ్వానించారని తెలిసింది. NOVలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆహ్వానం పంపారని సమాచారం. రావడానికి జిన్‌పింగ్ అంగీకరించారో లేదో స్పష్టత రాలేదు. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయమూ వివరణ ఇవ్వడం లేదు.