News January 5, 2025
శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం తెలిపింది. రద్దీ పెరగడంతో అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రస్ట్ జారీ చేసింది. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. త్వరలో శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఉండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరగనుంది.
Similar News
News November 19, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

భారత సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 513 పాయింట్లు పెరిగి 85,186.47(0.61%) వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 26,052.65(0.55%) వద్ద క్లోజ్ అయ్యింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పడిపోయింది. ఓవరాల్గా BSE లిస్టెడ్ కంపెనీలు రూ.474.6 లక్షల కోట్ల నుంచి రూ.475.6 లక్షల కోట్లకు చేరాయి. అంటే సింగిల్ సెషన్లోనే రూ.లక్ష కోట్లకు పైగా లబ్ధి పొందాయి.
News November 19, 2025
BREAKING: ఖాతాల్లో రూ.7,000 జమ

AP: పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోదీ TNలోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో యాడ్ అయ్యాయి. మొత్తంగా రూ.7 వేల చొప్పున జమయ్యాయి.
News November 19, 2025
బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.


