News January 5, 2025
శబరిమలకు పోటెత్తిన భక్తులు
శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం తెలిపింది. రద్దీ పెరగడంతో అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రస్ట్ జారీ చేసింది. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. త్వరలో శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఉండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరగనుంది.
Similar News
News January 25, 2025
PHOTOS: ‘మహాకుంభ్’లో డ్రోన్ షో
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా సందర్భంగా డ్రోన్ షో నిర్వహించారు. 2,500 ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్‌లను ఉపయోగించి భారతీయ పౌరాణిక చరిత్ర, సంప్రదాయాలను ప్రదర్శించారు. డ్రోన్‌లతో తీర్చిదిద్దిన శివుడు, శంఖం వంటి రూపాలు ఆకట్టుకున్నాయి.
News January 25, 2025
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు
TG: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉ.8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై విచారించింది. రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
News January 25, 2025
రాజకీయాల్లోకి త్రిష? తల్లి ఏమన్నారంటే?
సినీ నటి త్రిష త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. త్రిష సినిమాలను వదిలేస్తారన్న వార్తల్లో నిజం లేదని, ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే సినిమాలను వదిలేయడంపై త్రిష, ఆమె తల్లికి మధ్య వివాదం జరిగినట్లు ఇటీవల ఓ తమిళ సినిమా క్రిటిక్ పేర్కొన్నారు. దీనిపై త్రిష నుంచి స్పష్టత రావాల్సి ఉంది.