News December 20, 2024

శబరిమలకు పోటెత్తిన భక్తులు

image

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96వేలకు పైగా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. మండల పూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. DEC 22 నుంచి రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

Similar News

News January 21, 2025

ముగిసిన KRMB సమావేశం

image

TG: హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

News January 21, 2025

హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట

image

AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News January 21, 2025

ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..

image

అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.