News June 20, 2024
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.
Similar News
News January 12, 2026
APPLY NOW: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (<
News January 12, 2026
ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే?

మేష రాశి -రామేశ్వరం, వృషభ రాశి -సోమనాథ్,
మిథున రాశి -నాగేశ్వరం, కర్కాటక రాశి -ఓంకారేశ్వరం,
సింహ రాశి -వైద్యనాథ్, కన్య రాశి -శ్రీశైలం,
తులా రాశి -మహాకాళేశ్వరం, వృశ్చిక రాశి -ఘృష్ణేశ్వరం,
ధనుస్సు రాశి -కాశీ, మకర రాశి -భీమశంకర్,
కుంభ రాశి -కేదార్నాథ్, మీన రాశి -త్రయంబకేశ్వర్,
ఇలా రాశుల ప్రకారం క్షేత్రాలను సందర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగి, శివానుగ్రహంతో సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం.
News January 12, 2026
ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారంటే?

ఎగ్ఫ్రీజింగ్ని అండాశయ క్రయోప్రిజర్వేషన్ అని కూడా అంటారు. కెరీర్ లేదా ఇతర కారణాల వల్ల లేటుగా పిల్లల్ని కనాలనుకొనే మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ సజ్జెస్ట్ చేస్తారు. మహిళల అండాలను సేకరించి చాలా కాలం పాటు ఫ్రీజ్ చేస్తారు. 37 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం అండాశయం నుంచి అండాలను ఉత్పత్తి చేయడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తారు. తర్వాత వాటిని భద్రపరుస్తారు.


