News June 20, 2024
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.
Similar News
News September 17, 2024
మహిళలు రాత్రి వేళల్లో పనిచేయకుండా అడ్డుకోలేం: సుప్రీంకోర్టు
నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాత్రి పనివేళల నుంచి మహిళా డాక్టర్లకు విముక్తి కల్పించవచ్చనే బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మహిళలకు మినహాయింపులు అవసరం లేదని, వారికి సమాన అవకాశాలు కల్పించాని సీజే బెంచ్ అభిప్రాయపడింది. మహిళా వైద్యులకు పురుషులతో సమానంగా పని చేసేందుకు అనుమతించాలని ఆదేశించింది.
News September 17, 2024
మద్యం రేట్లు పెంచడంతో గంజాయికి ఎడిక్ట్ అయ్యారు: మంత్రి కొల్లు
AP: తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ రూపొందించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. లిక్కర్ పాలసీపై క్యాబినెట్ సబ్‌కమిటీ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడారు. ‘గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో చాలామంది గంజాయికి ఎడిక్ట్ అయ్యారు. నాసిరకం మందుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు’ అని కొల్లు మండిపడ్డారు. కొత్తగా ప్రీమియం ఔట్‌లెట్స్ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.
News September 17, 2024
కాంగ్రెస్ కూడా బ్రిటిష్ వాళ్లలానే: మోదీ
బ్రిటిష్ పాలకులకు, కాంగ్రెస్‌కు మధ్య పోలికలున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మన దేశ స్వాతంత్య్రంలో గణేశ్ ఉత్సవం ముఖ్యపాత్ర పోషించింది. విభజించి పాలించే బ్రిటిష్ వారు అప్పట్లో గణేశ్ ఉత్సవాలపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ విగ్రహాన్ని కటకటాల వెనుక ఉంచారు. ఇది బాధించింది. ఇలాంటివి జరగనివ్వకూడదు’ అని అన్నారు.