News August 8, 2024

ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీ హోదా

image

TG: సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీగా శివధర్ రెడ్డి, సీఐడీ డీజీగా షికా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్‌, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రాలకు అవకాశం కల్పించింది.

Similar News

News September 15, 2024

ఏడాదికి ఓసారైనా ఈ పరీక్షలు చేయించండి

image

ఎంత ఆరోగ్యవంతులైనా ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొన్ని టెస్టులు చేయించాలంటున్నారు అపోలో వైద్యుడు డా. సుధీర్ కుమార్. షుగర్, బీపీ టెస్టులే కాకుండా ఎకోకార్డియోగ్రామ్, హీమోగ్లోబిన్, ఈసీజీ, యూరిక్ యాసిడ్, విటమిన్ డీ-బి12, ట్రెడ్‌మిల్ టెస్ట్, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ టెస్ట్, చెస్ట్ ఎక్స్‌రే సహా 20 టెస్టుల్ని చేయిస్తే ముందుగానే పెను సమస్యల్ని గుర్తించొచ్చని ఆయన ట్విటర్‌లో వివరించారు.

News September 15, 2024

488 జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో (SEP 16) ముగియనుంది. రెగ్యులర్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ కానున్న ఈ పోస్టులకు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) చేసిన వారు అర్హులు. వయసు ఓసీలకు 42 ఏళ్లు , మిగతా వారికి 47 ఏళ్లు మించకూడదు. పూర్తి వివరాల కోసం <>https://dme.ap.nic.in/<<>> వెబ్‌సైట్ చూడండి.

News September 15, 2024

భారత దిగ్గజాలు ఇండియాను పాక్‌‌కు పంపండి.. ప్లీజ్: మోయిన్

image

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్‌ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్, ద్రవిడ్, గంగూలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ‘క్రికెట్ ఆగకూడదు. ఇరు దేశాలు ఆడటమనేది పాక్‌తో పాటు మొత్తం క్రికెట్‌కు మంచిది. ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్‌లో పర్యటించకూడదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.