News October 12, 2024
విమాన ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీసీఏ

తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ <<14334728>>ఘటనపై<<>> DGCA విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. 141 మందితో ఉన్న విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలెట్‌తో పాటు విమాన సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
అబార్షన్ అయినా లీవ్ తీసుకోవచ్చు

మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్ అయినా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే దీనికి తగిన డాక్యుమెంట్లు చూపించాలి. అబార్షన్ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.
News November 15, 2025
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.


