News August 14, 2024

ఆ ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ

image

AP: వెయిటింగ్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. జాషువా, అమ్మిరెడ్డి, విశాల్ గున్ని, రిశాంత్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్, విజయరావు, కాంతిరాణా టాటా సహా పలువురు ఈ జాబితాలో ఉన్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని పేర్కొన్నారు.

Similar News

News July 8, 2025

లండన్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా

image

ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా లండన్ చేరుకుంది. హీత్రూ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆటగాళ్లు నేరుగా హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఎల్లుండి (ఈ నెల 10న) ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా కొనసాగుతున్నాయి.

News July 8, 2025

మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు నిధులు విడుదల

image

TG: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల పెండింగ్ జీతాలు రూ.150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధుల జమ కానుండగా, ఒకట్రెండు రోజుల్లో 53 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.

News July 8, 2025

యాప్స్‌లో మోసం.. నాలుగింతలు వసూలు!

image

రైడ్ పూలింగ్ యాప్స్‌ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్‌గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్‌లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్‌లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.