News August 14, 2024
ధనుష్ ‘3’ మరోసారి రీరిలీజ్

తమిళ స్టార్ హీరో ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘3’ మరోసారి రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14న ఈ మూవీ తెలుగు వెర్షన్ను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య తెరకెక్కించిన ఈ మూవీ 2012లో రిలీజవగా 2022లో రీరిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో మరోసారి ‘3’ మూవీ చూసేందుకు మీరూ వెళ్తారా?
Similar News
News October 14, 2025
దీపావళి.. శునకాలకు ప్రత్యేక పూజలు చేస్తారు!

నేపాల్లో దీపావళి సందర్భంగా ఐదు రోజుల తిహర్ జరుపుకుంటారు. ఇందులో భాగంగా రెండో రోజు శునకాలను పూజిస్తుంటారు. మానవుల పట్ల శునకాలు చూపించే విశ్వసనీయతకు కృతజ్ఞతలు చెప్పడానికి దీనిని పాటిస్తారు. వీధి, పెంపుడు కుక్కలనే తేడా లేకుండా అన్ని శునకాలకూ పూలమాలలు వేసి నుదిటిపై తిలకం దిద్దుతారు. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించి గౌరవిస్తారు. ఈ సంస్కృతి నేపాలీ ప్రజల జంతు ప్రేమను చాటుతుంది.
News October 14, 2025
వాస్తుతో సంతోషకర జీవితం

ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండేవారందరూ సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తద్వారా మంచి నిద్ర, విశ్రాంతి లభిస్తాయి. సామాజిక బంధాలను మెరుగుపరిచే ఆలోచనలు తెస్తాయి. అవి అవకాశాలను మోసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాయి. దీంతో ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన జీవితానికి వాస్తు మూల కారణం’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News October 14, 2025
ఉత్కంఠ పోరు.. భారత్, పాక్ మ్యాచ్ డ్రా

మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్-2025 U21 హాకీ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లు 3-3 గోల్స్ చేశాయి. ఒక దశలో 0-2తో వెనుకబడిన IND చివర్లో అద్భుతంగా పోరాడి 3-2తో లీడ్లోకి వెళ్లింది. విజయం ఖాయమనుకున్న సమయంలో పాక్ గోల్ కొట్టి లెవెల్ చేసింది. ఇప్పటికే బ్రిటన్, న్యూజిలాండ్పై గెలిచిన IND పాయింట్స్ టేబుల్లో టాప్లో కొనసాగుతోంది.