News August 14, 2024

ధనుష్ ‘3’ మరోసారి రీరిలీజ్

image

తమిళ స్టార్ హీరో ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘3’ మరోసారి రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య తెరకెక్కించిన ఈ మూవీ 2012లో రిలీజవగా 2022లో రీరిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో మరోసారి ‘3’ మూవీ చూసేందుకు మీరూ వెళ్తారా?

Similar News

News September 18, 2024

చైనా పౌరుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

image

వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైం రాకెట్ న‌డుపుతున్న చైనా పౌరుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాక‌రించింది. రెన్ చావోపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ పిటిషన్‌ను ప‌రిగ‌ణించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణలపై రెన్ చావోను నోయిడా పోలీసులు 2022లో అరెస్టు చేశారు. వ్యాపారం చేసే విదేశీయులు భారత చట్టాలకు లోబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు గతంలో అతని బెయిల్ తిరస్కరించింది.

News September 18, 2024

చక్కటి ఆలోచన.. అడవిలో కంటైనర్ స్కూల్

image

TG: దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ఇదే.

News September 18, 2024

సీఎంకు చెక్కు అందజేసిన అనన్య

image

AP: విజయవాడ వరద బాధితుల కోసం తెలుగు హీరోయిన్ కొన్ని రోజుల క్రితం రూ.2.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. అటు తెలంగాణలోని వరద బాధితులకు సైతం ఈ హీరోయిన్ రూ.2.50 లక్షల విరాళం ప్రకటించారు.