News March 16, 2024
YCP అభ్యర్థులను ప్రకటించనున్న ధర్మాన, నందిగం సురేశ్

కాసేపట్లో YCP ఎమ్మెల్యే, MP అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.
Similar News
News December 3, 2025
శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.
News December 3, 2025
ఎచ్చెర్ల: మహిళ హత్య?

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 3, 2025
శ్రీకాకుళం: అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఐదు నెలల కాలానికి పనిచేయవలసి ఉంటుందన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 5 లోపు ఎంఆర్సీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


