News March 16, 2024

YCP అభ్యర్థులను ప్రకటించనున్న ధర్మాన, నందిగం సురేశ్

image

కాసేపట్లో YCP MP, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.

Similar News

News April 16, 2026

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ వకుల్

image

యువతను డ్రగ్స్ రహిత సమాజం వైపు నడిపించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిన ‘సంకల్పం’ కార్యక్రమం గురువారం చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాయని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, వ్యసనాల బారిన పడకుండా చదువుపై ఏకాగ్రత వహించాలని పిలుపునిచ్చారు.

News April 16, 2026

సీఎం పర్యటన వేళ పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

image

సీఎం చంద్రబాబు రేపు మంగళగిరి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలోని సీకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గురువారం కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ఎస్పీ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక వద్ద ప్రొటోకాల్ అమలు, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా పరమైన అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

News April 16, 2026

GNT: స్వీయ జనగణనలో సీఎం చంద్రబాబు

image

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు se.census.gov.in పోర్టల్ ద్వారా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 33 ప్రశ్నలతో కూడిన ఈ విధానాన్ని ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్.. సీఎంకు వివరించారు. ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ వరకు తమ కుటుంబ, ఇళ్ల వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.