News March 10, 2025

నేటి నుంచి ధర్మపురి నృసింహుని బ్రహ్మోత్సవాలు

image

TG: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీల్లో స్వామివార్ల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న రథోత్సవం, 20, 21, 22 తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకాంతోత్సవాలను జరిపిస్తారు.

Similar News

News March 25, 2025

ట్రంప్‌కు గిఫ్ట్ పంపించిన పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం మరింత పెరుగుతోంది. ఈ నెల మొదట్లో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కోఫ్‌కు భేటీ అనంతరం ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ ఆయనకు ఇచ్చారని మాస్కో ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఆ బహుమతి పట్ల ట్రంప్ చాలా సంతోషించారని విట్కోఫ్ తాజాగా వెల్లడించారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే అమెరికా, రష్యా బంధం ట్రంప్ వచ్చాక మెరుగుపడుతున్న సంగతి తెలిసిందే.

News March 25, 2025

బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

image

‘ఐ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్’ అని పేరు పెట్టారు. తన భర్త-బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్, కొడుకుతో కలిసి దిగిన ఫొటోలను ఆమె SMలో పంచుకున్నారు. 2022 నుంచి వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేసిన అమీ గతేడాది పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు మాజీ భర్త జార్జ్‌తో ఆమె ఓ కొడుకును కన్నారు. 2021లో అమీ, జార్జ్ విడిపోయారు.

News March 25, 2025

UNSUNG HERO: అరంగేట్రంలోనే నిగమ్ సంచలనం

image

ఐపీఎల్ అరంగేట్రంలోనే విప్రాజ్ నిగమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ 113 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నిగమ్ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు బాది సమీకరణాలు మార్చేశారు. LSGపై DC సంచలన విజయంలో అశుతోశ్ శర్మకు ఎంత క్రెడిట్ ఉందో 20 ఏళ్ల నిగమ్‌కూ అంతే ఉంది. అందరూ అశుతోశ్‌ను పొగుడుతున్నారు కానీ నిగమ్‌ను మాత్రం మరిచిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

error: Content is protected !!