News June 12, 2024
ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా: సత్యకుమార్ యాదవ్

AP: బీజేపీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నన్ను ఆదరించిన ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 19, 2025
వ్యోమగాముల తిరుగు ప్రయాణం స్ఫూర్తిదాయకం: CBN

వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా భూమిపైకి రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారి తిరుగు ప్రయాణం, టీమ్ వర్క్ ఆదర్శప్రాయమైన మానవ సంకల్పాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. దీనిని సుసాధ్యం చేసినందుకు ప్రతి ఒక్కరినీ అభినందించారు. వ్యోమగాముల శక్తి సామర్థ్యాలకు సెల్యూట్ చేశారు.
News March 19, 2025
ఉరుములు, మెరుపులతో వర్షాలు

TG: ఈ నెల 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హైదరాబాద్ తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 21, 23న తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
News March 19, 2025
భయపడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు

బెట్టింగ్ యాప్ ప్రచారం ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలిట శాపంగా మారింది. అత్యాశకు పోతే అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. ప్రమోషన్స్ చేసిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు. తమకు వచ్చిన ఫేమ్ అంతా ఒక్కసారిగా నాశనం అవుతుండటం వారి ఆందోళనలను రెట్టింపు చేస్తోంది. దీనికి తాజాగా ఈడీ కూడా తోడవ్వడంతో తమ పరిస్థితి ఏమవుతుందో అని కొందరు భయపడుతున్నారు.