News March 23, 2024
IPLలో ధోనీ మరో రికార్డు
సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో రికార్డు నమోదు చేశారు. అత్యధిక రనౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనుజ్ రావత్‌ను రనౌట్ చేశారు. దీంతో ఆయన ఇప్పటివరకు 42 మందిని రనౌట్ చేశారు. అలాగే 138 క్యాచ్‌లు పట్టారు. ఓవరాల్‌గా 180 మందిని ఔట్ చేశారు. ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్ (169), సాహా (106), రాబిన్ ఉతప్ప (90), పార్థివ్ పటేల్ (81) ఉన్నారు.
Similar News
News September 11, 2024
దొంగలకు షాక్.. ఇద్దరు మృతి
TG: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఘటన MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయిన్‌పల్లిలోని సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
News September 11, 2024
భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి కానుందా?
TG: చెరువులు, నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు ‘హైడ్రా’ అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. హైడ్రా నుంచి NOC ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా నిబంధనలను సవరించనున్నట్లు సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మిస్తే ఇంటి నంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News September 11, 2024
విశాఖకు మరో వందేభారత్
విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.