News March 22, 2024
గత IPLలోనే ధోనీ నాకు హింట్ ఇచ్చారు: గైక్వాడ్

తనకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత సంవత్సరమే మహీ భాయ్ నాకు కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చారు. సిద్ధంగా ఉండు.. నీకిది సర్‌ప్రైజ్‌గా ఉండకూడదు అని చెప్పారు. నేను క్యాంప్‌లో జాయిన్ అయినప్పుడు మ్యాచ్ ప్రణాళికలపై సూచనలు చేశారు. కెప్టెన్ చేయాలని ఆయన ముందే అనుకున్నారు. కానీ, ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారం క్రితం నాతో చెప్పారు’ అని తెలిపారు.
Similar News
News December 11, 2025
నిద్రలో పేరెంట్స్ నిర్లక్ష్యం.. పసికందు కన్నుమూత

తల్లిదండ్రులు నిద్రలో ఒరగడంతో 26 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన UPలో జరిగింది. తమ బిడ్డ సూఫియాన్‌ను తల్లిదండ్రులు మంచంపై మధ్యలో పెట్టుకుని పడుకున్నారు. నిద్రమత్తులో ఇద్దరు బేబీవైపు తిరగడంతో శిశువు మధ్యలో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయాడు. ఉదయం పాలు పట్టేందుకు తల్లి ప్రయత్నించగా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించగా శ్వాస ఆడక మరణించినట్లు వైద్యులు తెలిపారు. పేరెంట్స్.. జాగ్రత్త.
Share It
News December 11, 2025
ఒకే రోజు.. ఇటు హీరో, అటు విలన్!

ఆది పినిశెట్టి నటించిన ‘అఖండ-2’, ‘డ్రైవ్’ సినిమాలు ఒకే రోజున(DEC 12) రిలీజ్ అవుతున్నాయి. ‘అఖండ-2’లో మంత్రగాడిగా విలన్ రోల్‌లో, ‘డ్రైవ్’ మూవీలో హ్యాకింగ్ బారిన పడిన మీడియా దిగ్గజంగా నటించారు. రెండు సినిమాల్లోని పాత్రలకు, గెటప్‌లకు అసలు పోలికే లేదు. ఒకే వ్యక్తి ఇటు హీరోగా, అటు విలన్‌గా నటించిన సినిమాలు ఇలా ఒకే రోజున విడుదలవడం చాలా అరుదుగా జరుగుతుంది. మరి ఆది డబుల్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
News December 11, 2025
ట్రంప్ గోల్డ్ కార్డ్.. US పౌరసత్వానికి రాజమార్గం

US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘<<18527355>>గోల్డ్ కార్డ్<<>>’ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ స్కీమ్ ద్వారా అత్యంత వేగంగా ఆ దేశ పౌరసత్వం పొందచ్చు. భారీగా డబ్బులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలకు లీగల్ స్టేటస్, పౌరసత్వం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అప్లై చేస్తే $1M, కంపెనీలు స్పాన్సర్ చేస్తే $2M చెల్లించాలి. దీంతో పాటు DHS ఫీజు $15,000 కట్టాలి. అదే గ్రీన్ కార్డు కావాలంటే ఏళ్లపాటు నిరీక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి.


