News April 11, 2025
కెప్టెన్సీకి ధోనీ ఏమాత్రం సంకోచించలేదు: ఫ్లెమింగ్

చెన్నై టీమ్‌కు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు ధోనీ ఏమాత్రం వెనుకంజ వేయలేదని ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితిని ఆయనకు చెప్పగానే వెంటనే అర్థం చేసుకున్నారు. రుతు గాయపడిన నేపథ్యంలో తన స్థానంలో కెప్టెన్సీ చేయాలని కోరగానే ఏమాత్రం సంకోచించకుండా సరే అన్నారు’ అని పేర్కొన్నారు. మోచేతి గాయం కారణంగా ప్రస్తుత <<16058968>>కెప్టెన్ రుతురాజ్ సీజన్ మొత్తానికి<<>> దూరమైన సంగతి తెలిసిందే.
Similar News
News April 18, 2025
WILDLIFE PHOTOS: గాయపడిన సింహం

అడవికి రారాజు సింహమే అయినా ఆహారం కోసం అది వేటాడాల్సిందే. ఈ ప్రక్రియలో ఒక్కోసారి అవి తీవ్రంగా గాయపడిన పరిస్థితులూ ఉన్నాయి. మనుగడ కోసం జరిగిన ఘర్షణలో గాయపడిన ఓ సింహపు ఫొటోలను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్మన్ సింగ్ హీర్ క్లిక్‌మనిపించారు. తలపై గాయాలు, ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని కనిపించింది. అడవిలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో సింహాలు ఎంతలా గాయపడతాయో ఈ ఫొటోల్లో చూపించారు.
News April 18, 2025
VIRAL: నీ కష్టం పగోడికి కూడా రావొద్దు బ్రో!

తన ప్రియురాలు తనకంటే 22 ఏళ్లు పెద్దదని తెలియడంతో ఓ యువకుడు SMలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాకు 26 ఏళ్లు. నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నా. కొన్ని రోజుల క్రితం ఆమె వయసు 27 కాదు, 48 అని తెలిసింది. ఆమె అంత వయసైనట్లు కనిపించదు. ఆమె స్నేహితులు 30+ వాళ్లే ఉండేవాళ్లు. ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే ఇచ్చేది కాదు. ల్యాప్‌టాప్‌లో పాస్‌పోర్టు చూడటంతో ఇది తెలిసింది. నేనిప్పుడు ఏం చేయాలి?’ అని అతను వాపోయాడు.
News April 18, 2025
వినూత్నంగా కేఎల్ రాహుల్ కూతురు పేరు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ పాపకు ‘ఇవారా విపులా రాహుల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవారా అంటే అర్థం ‘దేవుడి బహుమతి’ అని పేర్కొన్నారు. పాప ‘నానీ’ గౌరవార్థం విపులా అని పెట్టినట్లు తెలిపారు.