News April 11, 2025

కెప్టెన్సీకి ధోనీ ఏమాత్రం సంకోచించలేదు: ఫ్లెమింగ్

image

చెన్నై టీమ్‌కు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు ధోనీ ఏమాత్రం వెనుకంజ వేయలేదని ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితిని ఆయనకు చెప్పగానే వెంటనే అర్థం చేసుకున్నారు. రుతు గాయపడిన నేపథ్యంలో తన స్థానంలో కెప్టెన్సీ చేయాలని కోరగానే ఏమాత్రం సంకోచించకుండా సరే అన్నారు’ అని పేర్కొన్నారు. మోచేతి గాయం కారణంగా ప్రస్తుత <<16058968>>కెప్టెన్ రుతురాజ్ సీజన్ మొత్తానికి<<>> దూరమైన సంగతి తెలిసిందే.

Similar News

News April 20, 2025

విభేదాలు పరిష్కరించుకుంటే మంచిదే: దేవేంద్ర ఫడణవీస్

image

రాజ్ ఠాక్రేతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్నఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై MH సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘ఇద్దరు కలిస్తే సంతోషమే, విభేదాలను పరిష్కరించుకోవడం మంచి విషయం’ అని సీఎం అన్నారు. కాగా MNSతో పొత్తులపై చర్చలు జరగలేదని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఇద్దరూ సోదరులని రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అన్నదమ్ముల బంధం తెగిపోదని అన్నారు.

News April 20, 2025

ఆసుపత్రిలో ప్రముఖ యాంకర్.. కారణమిదే

image

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనకు సర్జరీ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జనవరి నుంచి రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడినట్లు చెప్పారు. వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసుకుని ఆసుపత్రిలో చేరితే ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, మరో 3 వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించారు.

News April 20, 2025

వారానికి పైగా తల్లి, సోదరుడి శవాల మధ్య ఇంట్లోనే చిన్నారి

image

న్యూయార్క్‌(US)లోని ఓ ఇంట్లో తల్లి, సోదరుడు మృతిచెందగా నాలుగేళ్ల చిన్నారి శవాల మధ్యే వారానికి పైగా గడిపిన హృదయవిదారక ఘటన ఇది. లీసా(38), నాజిర్(8) అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే మరణించారు. లీసా కూతురు ప్రామిస్‌ ఆ మృతదేహాల మధ్యే ఉండిపోయింది. అసలేం జరిగిందో తెలియని ఆ చిన్నారి కొన్ని రోజులపాటు చాక్లెట్లు తింటూ సర్వైవ్ అయింది. లీసా సోదరి ఇంటికి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది.

error: Content is protected !!