News March 29, 2024

ధోనీ అద్భుతమైన ప్లేయర్: స్టీవ్ స్మిత్

image

క్రికెట్‌ను ధోనీ కంటే గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరని ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కొనియాడారు. ‘వికెట్ల వెనుక మిస్టర్ కూల్‌ను మించిన ఆటగాడు ఇండియాలో లేరు. అన్ని కోణాల్లోనూ ఆటను అర్థం చేసుకుంటారు. గేమ్ బయట ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. గ్రౌండులో చాలా కూల్‌గా ఉంటారు. అతనొక అద్భుతమైన ప్లేయర్. మహేంద్రుడితో కలిసి ఆడటం నాకు దక్కిన గొప్ప అవకాశం. నాకు ఆటపరంగా ఎంతో సాయం చేశారు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు: కలెక్టర్

image

నిజామాబాద్‌తో పాటు ఇన్‌ఛార్జ్ జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కామారెడ్డి జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సూచనలు చేయగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. చేసిన ఏర్పాట్లు గురించి వివరించారు.

News February 7, 2026

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
*శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ నెయ్యి: సీఎం CBN
*TTD నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ చెప్పింది: జగన్
*KCRను జైల్లో వేయకుండా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?: CM రేవంత్
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు
*అగ్ని-3 సక్సెస్.. 3వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!
*పాకిస్థాన్‌లో సూసైడ్ బాంబింగ్.. 69 మంది మృతి

News February 7, 2026

భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

image

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.