News April 6, 2025

రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోనీ

image

IPLకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై CSK స్టార్ ప్లేయర్ MS ధోనీ స్పందించారు. ‘ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఇంకా ఆడుతున్నాను. ఈ జులై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా, వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు మరో 10 నెలల సమయం ఉంది. ఆడగలనా, లేదా? అనేది నిర్ణయం శరీరం అందించే సహకారం బట్టి తీసుకుంటా’ అని రాజ్ షమానీతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో MSD వెల్లడించారు.

Similar News

News April 23, 2025

‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్.. అరెస్టు

image

J&Kలో ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్‌కు చెందిన మహమ్మద్ నౌషద్ ‘థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా’ అని పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా పోస్ట్ చేయడం వెనుక అతడి ఉద్దేశమేంటి? ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.

News April 23, 2025

విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. PSR ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిపోర్టు వెల్లడించింది. అటు PSRను విజయవాడ జైలుకు తరలించారు.

News April 23, 2025

నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

image

పహల్‌గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

error: Content is protected !!