News August 30, 2024
ధోనీ మరో IPL సీజన్ ఆడాలి: రైనా
మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఆడతారా? లేదా? అనేదానిపై సందేహాలు నెలకొన్న వేళ సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘గత సీజన్‌లో బ్యాటింగ్ చూశాక IPL 2025లో ధోనీ ఆడాలని నేను కోరుకుంటున్నా. టీమ్‌ను లీడ్ చేసేందుకు కూడా గైక్వాడ్‌కు మరో ఏడాది ధోనీ సహాయం చేస్తే బాగుంటుంది. అతనికి కెప్టెన్సీ మెలకువలు నేర్పించాలి. RCBతో ఓటమి తర్వాత రుతురాజ్ అద్భుతంగా పనిచేశారు’ అని మీడియాతో చెప్పారు.
Similar News
News September 20, 2024
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
News September 20, 2024
ప్చ్.. మళ్లీ తక్కువ రన్స్‌కే ఔటైన రోహిత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 రన్స్‌కే పెవిలియన్ చేరారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో జాకీర్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి అందరినీ నిరాశ పరిచారు. కాగా చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో రోహిత్‌కు ఏమైందంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
News September 20, 2024
నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలేసింది. గ్లోబల్ మార్కెట్స్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.