News April 14, 2024
DHONI: ఏంది సామీ ఈ క్రేజ్?

ORMAX Media సర్వే ప్రకారం IPL-2024లో మూడో వారంలోనూ మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచారు. తొలి రెండు వారాలు కూడా ధోనీనే మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్‌లో సిక్సర్లు బాది ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందించారు. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు.
Similar News
News March 31, 2026
మలయాళంలోకి అనుష్క ఎంట్రీ.. ఇవాళే ట్రైలర్

హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన ‘కథనార్’ ట్రైలర్ ఇవాళ మ.1.31 గంటలకు రిలీజ్ కానుంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్‌లో జయసూర్య లీడ్ రోల్ చేస్తుండగా ప్రభుదేవా కీలకపాత్ర పోషిస్తున్నారు. 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమట్టతు కథనార్ జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
News March 31, 2026
లాస్ట్ సీజన్ రన్నరప్.. పంజాబ్ ఈసారైనా కప్పు కొడుతుందా?

IPL: గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈరోజు ఈ సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడగా చెరో మూడుసార్లు గెలిచాయి. గత సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్, గుజరాత్ కెప్టెన్‌గా గిల్ కూడా రాణించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్‌లో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. చండీగఢ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News March 31, 2026
యుద్ధం ముంచేసింది.. మార్చిలో ₹51లక్షల కోట్లు ఆవిరి

మార్చి నెల దేశీయ స్టాక్ మార్కెట్లకు ఓ పీడ కలగా మిగిలిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఈనెలలో సెన్సెక్స్ 9,340 పాయింట్లు (11.5%).. నిఫ్టీ 2850 పాయింట్లు (11.3%) క్షీణించాయి. ₹51లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత 2 రోజుల్లోనే ₹18.60లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ సంపద ₹46వేలకోట్లకుపైన తగ్గింది. కాగా ఈరోజు మహావీర్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు.


