News May 8, 2024
ధోనీలా యానిమేటేడ్ బాహుబలి.. రాజమౌళి రియాక్షన్ ఇదే
దర్శకుడు రాజమౌళి ధోనీకి ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన బాహుబలి యానిమేటేడ్ సిరీస్‌లో బాహుబలి క్యారెక్టర్ ఫేస్ కట్ ధోనీని పోలి ఉన్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ధోనీ అంటే ఇష్టంతోనే బాహుబలి క్యారెక్టర్ ఫేస్ మిస్టర్ కూల్‌ని పోలి ఉందా? అని రాజమౌళిని యాంకర్ ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. ఆ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసిన వారు కూడా తనలాగే ధోనీ ఫ్యాన్స్ అని జక్కన్న బదులిచ్చారు.
Similar News
News January 5, 2025
అప్పులకు సిద్ధమవుతున్న రాష్ట్రాలు
జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ.4.73 లక్షల కోట్ల అప్పులు తీసుకోనున్నాయి. ఇందులో ఏపీ రూ.11వేల కోట్లు, తెలంగాణ రూ.30వేల కోట్ల అప్పులు చేయనున్నాయి. ప్రభుత్వాలతో ఇటీవల సంప్రదింపుల అనంతరం RBI ఈ వివరాలను ప్రకటించింది. జనవరిలో రూ.1.47 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.51 లక్షల కోట్లు, మార్చిలో రూ.1.74 లక్షల కోట్ల రుణాలను సమీకరించనున్నాయి.
News January 5, 2025
భారత్‌కు షాక్
ఆస్ట్రేలియా ముందు 162 రన్స్ టార్గెట్ ఉంచిన భారత్.. ఆశలన్నీ స్టార్ బౌలర్ బుమ్రాపైనే పెట్టుకుంది. కానీ నిన్న గాయపడ్డ అతడు ఇవాళ బ్యాటింగ్‌కు వచ్చినా బౌలింగ్‌కు రాలేదు. అతడి ప్లేస్‌లో అభిమన్యు ఈశ్వరన్ ఫీల్డింగ్‌కు వచ్చారు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో AUS ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లలోనే 35 రన్స్ చేశారు. దీంతో భారత్ పరాజయం లాంఛనమే కానుందా?
News January 5, 2025
వ్యవసాయ సీట్లకు రేపు స్పాట్ కౌన్సెలింగ్
TG: వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు HYD రాజేంద్రనగర్‌లోని కాలేజీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈఏపీసెట్-2024లో ర్యాంకు సాధించి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. వివరాలకు www.pjtsau.edu.inను చూడండి.