News August 29, 2024
భారత హాకీకి పర్యాయపదం ధ్యాన్‌చంద్

హకీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మేజర్ ధ్యాన్‌చంద్. అంతర్జాతీయ వేదికల్లో భారత్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలో మూడు సార్లు భారత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. హాకీ మాంత్రికుడిగా ధ్యాన్‌చంద్ పేరొందారు. హిట్లర్ వంటి నియంత మెప్పు పొందారంటే ఆయన ఆట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హాకీలో దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది.
Similar News
News March 17, 2026
ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తా: జీవన్ రెడ్డి

TG: తాను <<19382690>>పార్టీ<<>> మారాలనుకునే ఆలోచనకు కారణం జగిత్యాల MLA సంజయ్ అని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్న ఆయన.. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు 4 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. చూడాలి జగిత్యాలలో మున్ముందు ఏం జరుగుతుందో.
News March 17, 2026
టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్.. కారణం వెల్లడించిన అశ్విన్

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘టీమ్‌లో సీనియర్ బౌలర్ నేనుండగా పెర్త్ టెస్టులో(2024లో AUSతో) సుందర్‌ను ఆడించారు. అప్పుడే నా టైమ్ అయిపోయిందని గ్రహించా’ అని వెల్లడించారు. గంభీర్ అంటే తనకు ఇష్టమని, ఆయన వ్యక్తుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కోహ్లీ, రోహిత్, తాను ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదని, గెలుపు కోసమే ప్రయత్నించామన్నారు.
News March 17, 2026
ప్లాస్టిక్ ధరల పెరుగుదల.. కీలక రంగాలకు సెగ

కేరళంలోని ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు ముడిసరకు ధరల పెరుగుదల, మూలధన కొరతతో మూతపడుతున్నాయి. దీనివల్ల FMCG, ఫుట్‌వేర్, హెల్త్‌కేర్ సెక్టార్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 20-25% యూనిట్లు ఆపరేషన్స్ నిలిపివేసినట్లు కేరళ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫలితంగా బాటిళ్లు, సోల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఉత్పత్తుల మేకింగ్ ఛార్జీలు పెరిగాయి.


