News August 29, 2024
షుగర్ పేషెంట్స్ చెప్పులు/షూస్ లేకుండా నడవొద్దు: వైద్యులు

డయాబెటిక్ వ్యాధిగ్రస్థులకు గాయాలు త్వరగా మానవు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పులు లేకుండా నడవొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘డయాబెటిక్స్‌లో పాదాల ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్ వంటివి జరుగుతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల గాయం మానదు. గాయాల నొప్పి తెలియదు. దీని వల్ల మరింత నష్టం జరుగుతుంది. కాలు ధమనులలో అడ్డంకులు ఏర్పడి గాయం నయంకాదు’ అని సూచించారు. చెప్పులకు బదులు షూస్ ధరిస్తే ఇంకా మంచిది.
Similar News
News February 10, 2025
వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.
News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.
News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.