News October 7, 2024
సమోసాలు, చిప్స్, కుకీలతో మధుమేహం!

సమోసాలు, చిప్స్, కుకీలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారితీస్తున్నట్టు ICMR-MDRF పరిశోధనలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలో వండే ఈ పదార్థాల్లో అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్(AGEs) అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, గ్లూకోజ్ గ్లైకేషన్ ద్వారా ఇది ఏర్పడుతుంది. అధిక AGEs పదార్థాలు టైప్2 డయాబెటిస్‌కు కారణమని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాన్ని తినడం తగ్గించాలని సూచిస్తున్నారు.
Similar News
News March 30, 2026
ఏప్రిల్ 20 నుంచి 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవు: DGCA

విమానాల్లో ఇకపై 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవని డీజీసీఏ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీనిపై విమానయాన సంస్థలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఈ ఫ్రీ సీట్ కోటా 20%కు పరిమితమైంది. మిగతా సీట్లకు టికెట్‌కు అదనంగా ₹200 నుంచి ₹2100 వరకు సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఛార్జ్ లేకుండా సీట్ ఎంచుకునే వెసులుబాటు పెరుగుతుంది.
News March 30, 2026
మార్చి 30: చరిత్రలో ఈరోజు

* 1908: తొలి తరం భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి మహిళ దేవికారాణి జననం (ఫొటోలో)
* 1935: తెలుగు రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
* 1948: ప్రతినాయకుడు కన్నడ ప్రభాకర్ జననం
* 1971: తొలి తెలుగు సినిమా హీరోయిన్ సురభి కమలాబాయి మరణం
* 2011: సినీ నటుడు నూతన్ ప్రసాద్ మరణం
* ప్రపంచ ఇడ్లీ దినోత్సవం
News March 30, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


