News October 7, 2024

స‌మోసాలు, చిప్స్‌, కుకీలతో మధుమేహం!

image

స‌మోసాలు, చిప్స్‌, కుకీలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ మ‌ధుమేహానికి దారితీస్తున్నట్టు ICMR-MDRF ప‌రిశోధ‌న‌లో తేలింది. అధిక ఉష్ణోగ్ర‌త‌లో వండే ఈ ప‌దార్థాల్లో అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్(AGEs) అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, గ్లూకోజ్ గ్లైకేష‌న్ ద్వారా ఇది ఏర్ప‌డుతుంది. అధిక AGEs ప‌దార్థాలు టైప్2 డయాబెటిస్‌కు కారణమని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాన్ని తిన‌డం త‌గ్గించాలని సూచిస్తున్నారు.

Similar News

News November 5, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు తేదీలను బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా రేపటి నుంచి ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.100ఫైన్‌తో NOV 27-డిసెంబర్ 4, రూ.500తో DEC 5-11, రూ.1000తో డిసెంబర్ 12-18, రూ.2వేల ఫైన్‌తో DEC 19-27 వరకు చెల్లించవచ్చు.
* ఫస్టియర్ రెగ్యులర్ ఫీజు-రూ.520
* సెకండియర్ రెగ్యులర్ ఫీజు:రూ.520-రూ.720.

News November 5, 2024

కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఇదొక కారణమంటున్నారు!

image

విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉండటానికి బ్లాక్ వాటర్ కూడా ఓ కారణమని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఐరోపాలోని ఎవియన్ లెస్ బైన్స్ సరస్సు నుంచి సేకరించిన నీటిని కోహ్లీ & అనుష్క సేవిస్తుంటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గించి & చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ను కూడా తగ్గిస్తుంది. లీటరుకు రూ.4వేలు చెల్లించి కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

News November 5, 2024

2024 US elections: పోలింగ్ ప్రారంభం

image

అమెరికా 47వ అధ్య‌క్ష ఎన్నిక‌కు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్ప‌టికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్‌, బ్లూ స్టేట్స్‌లో పెద్ద‌గా హడావుడి లేక‌పోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెల‌కొంది. డెమోక్రాట్ల నుంచి క‌మ‌ల‌, ఆమె ర‌న్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్‌, రిప‌బ్లిక‌న్ల నుంచి ట్రంప్‌, ఆయ‌న ర‌న్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బ‌రిలో ఉన్నారు.