News May 24, 2024
రాయుడు.. కోహ్లీని టార్గెట్ చేశారా?

IPL2024 ఫైనల్ రేసు నుంచి RCB నిష్క్రమించాక ఆ జట్టుపై రాయుడు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. RCB ఓడిన వెంటనే.. CSK గతేడాది ట్రోఫీ గెలిచిన వీడియోను అంబటి షేర్ చేయడమూ చర్చనీయాంశమైంది. ఇక అంబటి ట్వీట్లు చూస్తుంటే.. అతడు కోహ్లీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వ్యక్తిగత మైల్‌స్టోన్స్‌కు బదులుగా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి ఉంటే RCB ఇప్పటికే టైటిల్స్ గెలిచేదని ట్వీట్ చేశారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News February 9, 2025
మరణాల్ని పుతిన్ ఆపాలనుకుంటున్నారు: ట్రంప్

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.
News February 9, 2025
మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. తన తల్లితో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. షార్ట్ హెయిర్‌తో పూర్తిగా విభిన్నంగా ఉన్నారు. కాగా విజయ్ నటిస్తున్న వీడీ12’(వర్కింగ్ టైటిల్) మూవీ నుంచి ఈ నెల 12న టైటిల్, టీజర్ విడుదల కానున్నాయి.
News February 9, 2025
కమీషన్లు, పర్సంటేజీలతో మంత్రుల దోపిడీ: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో పనుల కోసం వెళ్లిన ఎమ్మెల్యేలను మంత్రులు కమీషన్లు, పర్సంటేజీలు అడుగుతున్నారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘బిల్లు పాస్ కావాలంటే 10% పర్సంటేజ్ అడుగుతున్నారు. భూ సమస్యలు క్లియర్ కావాలంటే 30% పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నారు. మంత్రుల వైఖరి నచ్చకే ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర సంపదంతా ఢిల్లీకి దోచిపెడుతున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.