News March 28, 2025
అంచనాలే సన్‌రైజర్స్ కొంపముంచాయా?

IPLలో SRHపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తరచూ 250కి పైగా స్కోర్లు నమోదు చేస్తుండటంతో SRH ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ 300 రన్స్ గురించే చర్చ నడుస్తోంది. ఆ రికార్డు సన్‌రైజర్స్‌కు మాత్రమే సాధ్యమన్న అంచనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి ఉండొచ్చంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడిన అదే జట్టు, నిన్న అతి కష్టంగా 190 రన్స్ చేసిందని గుర్తుచేస్తున్నారు.
Similar News
News March 31, 2025
❤️ఇది కదా సక్సెస్ అంటే..!

నిన్న CSKపై RR ఘన విజయం సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న CSKను పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనీతో కలిసి దిగిన చిన్నప్పటి పరాగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్‌తో పోటీపడి ఆ జట్టును ఓడించడం కంటే సక్సెస్ ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News March 31, 2025
భారీగా పెరిగిన చికెన్ ధరలు

రంజాన్ పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకూ విక్రయాలు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో గత వారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు తగ్గాయి. మళ్లీ నిన్న కేజీపై రూ.50 నుంచి రూ.70 పెరగ్గా, ఇవాళ ఆ ధరలూ మరింత ఎక్కువ అవడం గమనార్హం.
News March 31, 2025
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించారు. ఒకే మైదానంలో వన్డేలు, IPLలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్టార్క్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఏ బౌలర్ ఈ ఫీట్ సాధించలేకపోయారు. SRHతో జరిగిన మ్యాచులో స్టార్క్ 5 వికెట్లు పడగొట్టారు. 2023లో ఇదే వేదికలో భారత్‌తో జరిగిన వన్డేలోనూ 5 వికెట్లు తీశారు. అలాగే DC తరఫున 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి విదేశీ ప్లేయర్‌గానూ ఆయన నిలిచారు.