News August 6, 2024

గాయమే పతకాన్ని దూరం చేసిందా?

image

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ కాంస్యం గెలుస్తారని అంతా భావించారు. అయితే మలేషియా ప్లేయర్ చేతిలో 2-1తో పరాజయం పాలయ్యారు. మోచేతికి గాయంతోనే సేన్ ఆటను కొనసాగించారు. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ఆటంకం కలగడంతో ఆటపై ప్రభావం చూపిందని లక్ష్యసేన్ చెప్పారు. కాగా 2012, 2016, 2021 ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన భారత ప్లేయర్లు ఈ సారి నిరాశపరిచారు.

Similar News

News September 18, 2024

చిలుకను పట్టిస్తే రూ.10వేలు రివార్డు

image

తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్‌లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.

News September 18, 2024

చంద్రయాన్-4కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

image

ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-4కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి తెచ్చేలా చంద్రయాన్-4కి ఇస్రో రూపకల్పన చేసింది. ఇటు గగన్‌యాన్, శుక్రయాన్ విస్తరణ ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,516 కోట్లు కేటాయించింది. పీఎం-ఆశా పథకానికి రూ.35 కోట్లు కేటాయింపు, ఎన్జీఎల్ఏ వాహననౌకకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News September 18, 2024

పడేసిన టెక్ షేర్లు.. ఆదుకొన్న ఫైనాన్స్ షేర్లు

image

స్టాక్ మార్కెట్లు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల కోతపై US ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. భయంతో ఐటీ షేర్లను తెగనమ్మడంతో బెంచ్‌మార్క్ సూచీలు కనిష్ఠ స్థాయులకు చేరాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అండగా నిలవడంతో నష్టాల్ని తగ్గించుకున్నాయి. సెన్సెక్స్ 82,948 (-131), నిఫ్టీ 25,377 (-41) వద్ద క్లోజయ్యాయి. టాప్-5 లూజర్స్‌లో టెక్ షేర్లే ఉన్నాయి.