News February 13, 2025

సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా? ఇలా చేయండి

image

TG: రాష్ట్రంలో ఇంకా 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని భట్టి విక్రమార్క తెలపగా సర్వే సమయంలో తమ ఇంటికి సిబ్బందే రాలేదని చాలామంది చెబుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బందే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి స్పష్టం చేశారు. మండల కార్యాలయాల్లో ఈనెల 16-28 మధ్య అందుబాటులో ఉండే అధికారులకు, ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

Similar News

News March 23, 2025

ఇలాగే ఆడితే RCBదే కప్: పఠాన్

image

ఆర్సీబీ ‘ఈసాల కప్ నమ్దే’ కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. కచ్చితంగా టాప్-4లో ఉంటారు. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారు. అతనిలో నాకు నచ్చేది అదే’ అని పేర్కొన్నారు.

News March 23, 2025

మే నుంచి కొత్త పింఛన్లు: మంత్రి

image

AP: రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

News March 23, 2025

ఆ సినిమా విషయంలో బాధతో చనిపోయేవాడినేమో: SJ సూర్య

image

తన కెరీర్‌ను మలుపుతిప్పిన ‘ఖుషి’ మూవీ గురించి నటుడు, దర్శకుడు SJ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తమిళంలో ఖుషీ తొలి కాపీ చూసిన ఎవరికీ ఆ మూవీ నచ్చలేదు. విడుదలయ్యాక మాత్రం పెద్ద హిట్ అయింది. ముందు ఉన్న స్పందనే రిలీజ్ తర్వాతా కొనసాగి ఉంటే బహుశా ఆ బాధతో చనిపోయి ఉండేవాడినేమో’ అని పేర్కొన్నారు. తమిళంలో సూపర్ హిట్టైన అదే ‘ఖుషీ’ని తెలుగులో పవన్ కళ్యాణ్‌తో సూర్య రీమేక్ చేశారు.

error: Content is protected !!