News February 11, 2025
మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతులకు ₹1,834.09 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాల్లో 4.41 లక్షల మందికి, ఫిబ్రవరి 5న ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి, ఇవాళ 2 ఎకరాలలోపు సాగు చేస్తున్న 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?
Similar News
News March 28, 2025
ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్

హెచ్‌బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
News March 28, 2025
విషాదం: విషమిచ్చిన తల్లి.. ముగ్గురు పిల్లల మృతి!

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు బిడ్డలకు నిన్న రాత్రి పెరుగన్నంలో విషం కలిపి తినిపించి అనంతరం తానూ తీసుకుంది. ఉదయం భర్త వచ్చేసరికి ముగ్గురు బిడ్డలు సాయి కృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) విగతజీవులుగా కనిపించారు. తల్లిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News March 28, 2025
అంచనాలే సన్‌రైజర్స్ కొంపముంచాయా?

IPLలో SRHపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తరచూ 250కి పైగా స్కోర్లు నమోదు చేస్తుండటంతో SRH ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ 300 రన్స్ గురించే చర్చ నడుస్తోంది. ఆ రికార్డు సన్‌రైజర్స్‌కు మాత్రమే సాధ్యమన్న అంచనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి ఉండొచ్చంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడిన అదే జట్టు, నిన్న అతి కష్టంగా 190 రన్స్ చేసిందని గుర్తుచేస్తున్నారు.