News September 8, 2024
మీకు తెలుసా: పాస్‌పోర్టుకు 4వేల ఏళ్ల చరిత్ర!
పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్‌పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.
Similar News
News October 4, 2024
ఒక్కో కార్మికుడికి ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్
పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌తో యుద్ధాల వల్ల ఇజ్రాయెల్‌లో ఏర్పడిన కార్మికుల కొరత భారతీయులకు కాసుల పంట కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపికైన స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు ₹1.92 లక్షల జీతం, ₹16,515 బోనస్, వైద్య బీమా, వసతి లభిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే భారతీయులు అక్కడ పనిచేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 11 వేల మందిని ఎంపిక చేశారు.
News October 4, 2024
ఈ నెల 14న హ్యుందాయ్ IPO
దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద హ్యుందాయ్ IPO అక్టోబర్ 14న ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ భారతీయ విభాగం కంపెనీ, ప్రమోటర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.
News October 4, 2024
కేటీఆర్, హరీశ్‌పై కేసు నమోదు
TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్‌లో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.