News November 30, 2024
మీకు తెలుసా: క్యారమ్స్ ఎక్కడ పుట్టిందంటే…

క్యారమ్స్ గేమ్ గురించి తెలియనివారు చాలా తక్కువగా ఉంటారు. స్నేహితులు, కుటుంబీకులతో ఆడుకునేందుకు అనువైన చక్కటి టైమ్ పాస్ గేమ్ ఇది. ఈ ఆట భారత్‌లోనే పుట్టింది. 20వ శతాబ్దం మొదట్లో రాజకుటుంబాలు ఈ ఆటను ఆడేవి. 1935లో భారత్, శ్రీలంక కలిసి తొలిసారిగా క్యారమ్స్ టోర్నీ నిర్వహించాయి. ఆ తర్వాత 1988లో అంతర్జాతీయ క్యారమ్ ఫెడరేషన్ చెన్నైలో ఏర్పడింది. పటియాలా ప్యాలెస్‌లో నేటికీ అద్దపు క్యారమ్ బోర్డు ఉంది.
Similar News
News March 6, 2026
ఆయిల్ ధరల ప్రభావం జీడీపీపై ఉంటుందా?

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత జీడీపీపై ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధర 10 డాలర్లు పెరిగిన ప్రతీసారి 0.5% జీడీపీ దెబ్బతింటుందంటున్నారు. ఇప్పటికే ముడి చమురు ధర 10 డాలర్ల వరకు పెరిగిందని.. ఆ ఎఫెక్ట్ జీడీపీపైన ఉంటుందన్నారు. వారం రోజుల్లోనే $69గా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర $78కు పెరిగిందని.. మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగితే అది చమురు ధర $87కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
News March 6, 2026
ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడిన దుబాయ్ బిలియనీర్

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తల నేపథ్యంలో UAE బిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు గల్ఫ్ దేశాలు భారీగా నిధులిచ్చాయని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యుద్ధాలు ఉండవంటూనే ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్స్ చేశారని మండిపడ్డారు. కాగా ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.
News March 6, 2026
ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

తన ఏజ్‌లెస్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్‌కు కారణమని అతను చెబుతుంటారు.


