News August 10, 2024

మీకు తెలుసా: తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి?

image

తెల్లజుట్టు సమస్య నేడు ప్రతి ఒక్కర్నీ వేధిస్తోంది. ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. దాని ప్రకారం.. ‘మెలనోసైట్ స్టెమ్‌సెల్స్’ అనే కణాలు మన జుట్టు రంగును నిర్ధారిస్తాయి. ఆహార, జీవన శైలి అలవాట్లు, వృద్ధాప్య కారణాలతో మెలనోసైట్ మూల కణాలు బలహీనమవుతున్నట్లు గుర్తించారు. దాంతో జుట్టు సహజ రంగు స్వభావాన్ని కోల్పోయి తెల్లబడటం మొదలవుతోందని వారు తెలిపారు.

Similar News

News September 13, 2024

టీమ్‌ఇండియా ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త బౌలింగ్ కోచ్

image

బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. కోచ్ గౌతమ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. కొత్త బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్ కూడా జట్టులో చేరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈనెల 19-23 వరకు తొలి టెస్ట్, ఈనెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరగనుంది.

News September 13, 2024

జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో స్వల్ప ఊరట

image

AP: TDP ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో YCP నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌కు సుప్రీంకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామంది. నిందితులు 24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలంది. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంను ఆశ్రయించారు.

News September 13, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1300 పెరిగి రూ.74,450కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1200 పెరిగి రూ.68,250 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.3,500 పెరిగి రూ.95వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి.