News January 25, 2025

‘సజ్జల వల్లే రాజీనామా చేశారా?’.. విజయసాయి సమాధానమిదే..

image

AP: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి స్పందించారు. ‘నా ప్రాధాన్యం ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలనని అనిపిస్తే చేస్తానని చెప్తా.. లేదంటే చేయనని చెప్తా. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడంలేదు. అందుకే ఎంపీ పదవి నుంచి తప్పుకున్నా’ అని వెల్లడించారు.

Similar News

News November 15, 2025

తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

image

తన ఫ్యూచర్‌(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్‌రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్‌పై చాలా ఫోకస్డ్‌గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్‌పై అతనికున్న ఫోకస్‌ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.

News November 15, 2025

కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News November 15, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు రోజుల్లోనే రూ.3,540 తగ్గడం విశేషం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,800 పతనమై రూ.1,14,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.