News January 25, 2025
‘సజ్జల వల్లే రాజీనామా చేశారా?’.. విజయసాయి సమాధానమిదే..

AP: వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పైచేయి వల్లే రాజీనామా చేశారని జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి స్పందించారు. ‘నా ప్రాధాన్యం ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ నాకు తెలుసు. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు. నా పదవికి న్యాయం చేయగలనని అనిపిస్తే చేస్తానని చెప్తా.. లేదంటే చేయనని చెప్తా. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం చేయగలనని అనుకోవడంలేదు. అందుకే ఎంపీ పదవి నుంచి తప్పుకున్నా’ అని వెల్లడించారు.
Similar News
News February 19, 2025
ఇవాళ అంతర్జాతీయ ‘టగ్ ఆఫ్ వార్’ డే

రెండు జట్లు తాడు లాగుతూ పోటీపడే ఆటను టగ్ ఆఫ్ వార్ అంటారు. రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు. ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రత్యర్థి జట్టును గీత తాకేలా ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారు. సరదా కోసం ఆడే ఈ ఆట 1900 నుంచి 1920 వరకు ఒలింపిక్స్‌లో కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఆట ఆడుతుంటారు. మీరూ ఎప్పుడైనా ఆడారా?
News February 19, 2025
మోనాలిసాకు బిగ్ షాక్?

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.
News February 19, 2025
తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.