News May 19, 2024
ఆ సమయంలో స్కోరు బోర్డు వైపు చూడలేదు: యశ్
నిన్నటి మ్యాచులో చివరి ఓవర్లో తాను స్కోరు బోర్డు వైపు చూడలేదని ఆర్సీబీ బౌలర్ యశ్ దయాళ్ అన్నారు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. తర్వాత బాల్‌కే ఔట్ చేసినట్లు తెలిపారు. ఇదే మ్యాచుకు టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. చివర్లో సరిగ్గా బౌలింగ్ చేయడంపైనే దృష్టిపెట్టానని.. కోహ్లీ సూచనలు పనికొచ్చాయన్నారు. మ్యాచుకు కీలకమైన చివరి ఓవర్లో యశ్ కేవలం ఏడు పరుగులు ఇవ్వడం గమనార్హం.
Similar News
News December 3, 2024
నేడు క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది.
News December 3, 2024
10-12 ఏళ్లు మాతోనే పంత్: సంజీవ్ గొయెంకా
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ తమతోపాటు 10-12 ఏళ్లు ఉంటారని లక్నో జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా అభిప్రాయపడ్డారు. వేలంలో ఆయనను దక్కించుకోవడంలో తాము సక్సెస్ అయ్యామన్నారు. ‘ప్రస్తుతం మా జట్టులో నలుగురు లీడర్లు ఉన్నారు. పంత్, మార్‌క్రమ్, పూరన్, మార్ష్ కెప్టెన్సీకి అర్హులే. వీరందరూ గెలవాలనే కసి, తపనతో ఉంటారు. ప్రస్తుతం అన్ని జట్ల కన్నా తమ జట్టే బలంగా, సమతుల్యంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
News December 3, 2024
ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘బ్రెయిన్ రాట్’
‘బ్రెయిన్ రాట్’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి క్షీణించడం, గతి తప్పడం. సోషల్ మీడియాలో అవసరం లేని కంటెంట్‌ను ఎక్కువ చూడటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ ప్రయోజనం లేకుండానే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలం గడిపేసేవారికీ ఈ పదం వర్తిస్తుంది. ఈ ఏడాదిలో ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.