News May 4, 2024
మోదీ రెండు చోట్ల పోటీ చేయలేదా?: జైరామ్

రాహుల్ గాంధీ LS ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయడంపై BJP చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ స్పందించారు. మోదీ రెండు స్థానాల్లో పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. BJP నుంచి సుష్మా స్వరాజ్, అటల్ బిహారీ వాజ్పేయీ 2 స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అమేథీ, రాయ్బరేలీ సంప్రదాయ స్థానాలు అని అమిత్ షా అన్నారని, అందుకే రాహుల్ అక్కడ పోటీ చేస్తున్నారని జైరామ్ పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
మరో తుఫాన్.. అతి భారీ వర్షాలు!

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని IMD తెలిపింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశముందని అంచనా వేసింది. ఈ నెల 27-29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది.
News November 21, 2025
AIతో జవాబు పత్రాల వాల్యుయేషన్!

TG: విద్యార్థుల ఆన్సర్ షీట్లను లెక్చరర్లతోనే కాకుండా AI ద్వారా దిద్దించాలని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా పాలిటెక్నిక్లో 2 సబ్జెక్టుల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కావడంతో AI ద్వారా దిద్దిన పేపర్లను లెక్చరర్లతో మరోసారి చెక్ చేయించనున్నారు. రైటింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. వాటిని ఏఐ ఎలా దిద్దుతుందనేది ఆసక్తికరం.
News November 21, 2025
శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించేది ఇక్కడే..

తిరుమామణి మండపం దాటాక కనిపించే సుందర సన్నిధే బంగారు వాకిలి. ఈ వాకిలికి పూర్తిగా బంగారు రేకుల తాపడం ఉంటుంది. దీనికి ఇరువైపులా శ్రీవారి ద్వారపాలకులు అయిన జయవిజయుల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీవారికి రోజూ చేసే తొలి సేవ అయిన సుప్రభాత సేవ ఈ బంగారు వాకిలి దగ్గరే మొదలవుతుంది. అన్నమాచార్యులు తమ కీర్తనల్లో ‘కనకరత్నకవాటకాంతు లిరుగడ గంటి’ అని వర్ణించింది కూడా ఈ దివ్య బంగారు వాకిలినే. <<-se>>#VINAROBHAGYAMU<<>>


