News April 10, 2025
బాలయ్య- బోయపాటి మధ్య విభేదాలు.. క్లారిటీ!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ-2’ షూటింగ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో షూటింగ్ సజావుగా జరగట్లేదనే రూమర్స్ ప్రస్తుతం టీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో దీనిపై సినీవర్గాలు స్పందించాయి. వీటిలో ఎలాంటి నిజం లేదని, షూట్ సజావుగా సాగుతోందని వెల్లడించాయి. వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.
Similar News
News April 22, 2025
ఉపాధి హామీ పని దినాలు తగ్గించిన కేంద్రం

TG: కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనిదినాలకు తగ్గించింది. గత ఏడాది రాష్ట్రానికి 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈ సారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం రూ.2,708.3 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనున్నారు. కాగా పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.
News April 22, 2025
రాజ్ కసిరెడ్డిని మరోసారి విచారించనున్న సిట్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు నుంచి విజయవాడకు తరలించిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణంలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశముంది.
News April 22, 2025
పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.